: కర్ణాటక ప్రచారానికి బయల్దేరి వెళ్లిన పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ తరపున ప్రచారం చేయడానికి కర్ణాటక బయల్దేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన హెలికాప్టర్ లో బయలుదేరారు. ప్రచారంలో భాగంగా ఆయన.... రాయచూర్, కోలార్, గురుమిడ్కల్ లలో నిర్వహిస్తున్న బహిరంగసభల్లో ప్రసంగిస్తారు. పవన్ పర్యటనను బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ కార్యాలయం సమన్వయం చేస్తోంది.