: 20 గంటలు సాగిన కాల్పులు... ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ లో దాదాపు 20 గంటల పాటు హోరాహోరీగా సాగిన కాల్పుల్లో ఒక ఇంట్లో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. జమ్మూ, కాశ్మీర్ రాజధాని నడిబొడ్డున ఉన్న అహ్మద్ నగర్ లో ఆదివారం సాయంత్రం ఇద్దరు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు... అబ్దుల్ మాజిద్ రంగ్రేజ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి, భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో ఇంటిని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. విషయం గ్రహించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూనే ఇంటి యజమాని, ఆయన కుటుంబ సభ్యులను బయటికి పంపివేశారు. దీంతో భద్రతా దళాలు ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటికి నిప్పంటించాయి. దాంతో ఉగ్రవాదులిద్దరూ మాడి మసైపోయారు.