: టీడీపీ అధిష్ఠానాన్ని హెచ్చరిస్తున్న భీమిలి రెబల్


టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ అభ్యర్ధులను ఓడిస్తామని ఆయా పార్టీల అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. తాజగా భీమిలి టీడీపీ నేత అనిత తనకు టికెట్ రాకపోవడంపై చిందులు తొక్కుతున్నారు. స్థానికులను కాదని, పార్టీలో అప్పుడే చేరిన వారికి ఎలా టికెట్ కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టీడీపీ సీటు కేటాయించింది. పార్టీ కోసం ఆది నుంచి కష్టపడ్డ తమను గాలికి వదిలేసి కొత్త వారికి పెద్ద పీట వేయడాన్ని అనిత ప్రశ్నిస్తున్నారు. గంటా ఎలా విజయం సాధిస్తారో చూస్తానంటూ ఆమె సవాలు విసిరారు. తాను టీడీపీ రెబల్ అభ్యర్ధిగా నామినేషన్ వేస్తానని ఆమె హెచ్చరించారు.

  • Loading...

More Telugu News