: బాలకృష్ణకు బి.ఫారం ఇచ్చిన చంద్రబాబు


సినీ హీరో బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ తరపున అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న విషయం విదితమే. హైదరాబాదులో ఇవాళ తనను కలవడానికి వచ్చిన బాలకృష్ణకు చంద్రబాబు బి.ఫారం అందించారు. అనంతరం ఎన్నికల ప్రచారం గురించి ఇరువురూ చర్చించినట్టు సమాచారం. మరోవైపు హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూపురంలో బాలకృష్ణ 16న నామినేషన్ దాఖలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News