: తండ్రి వెనుకే నడుస్తూ... బోరు బావిలో పడిన బాలుడు


తమిళనాడు తిరునల్వేలి జిల్లా కుంతలపురిలో రెండున్నరేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. తండ్రి వెనక నడుస్తున్న బాలుడు అకస్మాత్తుగా నిరుపయోగంగా ఉన్న బోరుబావిలో పడిపోయాడు. తండ్రి అధికారులకు సమాచారం అందించడంతో, వారు సంఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. కాగా బాలుడు ఎంత లోతులో ఉన్నాడన్నది ఇంకా తెలియలేదు. బాలుడ్ని రక్షించేందుకు అధికారులు ప్రొక్లెయినర్లు ఇతర యంత్రాలు రప్పించారు. కాగా ఈ నెల 6న విల్లుపురంలో నిరుపయోగంగా ఉన్న బోరుబావి గుంతలో మూడేళ్ల బాలిక పడిపోయింది. అధికారులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమెను రక్షించలేకపోయారు.

  • Loading...

More Telugu News