: వర్షంలోనే సభ కొనసాగించిన జైపాల్ రెడ్డి


కేంద్రమంత్రి, కాంగ్రెస్ మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి జైపాల్ రెడ్డి సభ జరుగుతుండగా వర్షం మొదలైంది. అంతకు ముందు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలో సమావేశం ముగించుకుని మధ్యాహ్నం బాలానగర్ చేరుకున్న ఆయనకు జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు రవి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దాసురామ్ నాయక్ తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. బాలానగర్ బస్టాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని బాలానగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జైపాల్ రెడ్డి మాట్లాడక ముందే పెద్దగా గాలి దుమారం రేగింది. భారీ వర్షం కురియడంతో సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. జోరున కురుస్తున్న వర్షంలో గొడుగు నీడలోనే ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సాధించి తీరుతామన్నారు. జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని అన్నారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News