: కేసీఆర్ కోతల రాయుడు... నిన్నటి వరకు పొగిడిన శ్రవణ్ నేడు దెప్పి పొడుపులు


కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయని, చేతలు గడప కూడా దాటవని టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు పెద్దపీట వేస్తానని తెలిపాడని... ఇప్పుడు, టీఆర్ఎస్ పార్టీని బేటా, బేటీ, దామాద్ కా పార్టీగా మార్చేశాడని దుయ్యబట్టారు. ఉద్యమంలో దళితుల భాగస్వామ్యం లేకుంటే ఉద్యమ స్వరూపం మారదని, తెలంగాణలో అధికారంలోకి వస్తే దళితుడ్ని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చాడని అన్నారు. తీరా రాష్ట్రం ఏర్పడ్డాక వారిని దరిదాపులకు కూడా రానివ్వడం లేదని ఆయన మండిపడ్డారు.

కేసీఆర్ ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న అంటాడని, ఏరు దాటాక బోడి మల్లన్న అంటాడని శ్రవణ్ అన్నారు. 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానంటూ ముస్లింలను కేసీఆర్ మభ్యపెడుతున్నారని... 12 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని, లేకుంటే తల నరుక్కుంటానని అన్నారని శ్రవణ్ గుర్తు చేశారు. పదే పదే తల నరుక్కుంటానని చెబుతున్న కేసీఆర్ ఎందరి తలలను నరుకుతాడని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News