: ఈ యువ డాక్టర్ అసెంబ్లీ మెట్లెక్కుతుందా?
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నుంచి ఈసారి ఓ డాక్టర్ అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ సతీమణి డాక్టర్ దేవీప్రియ చింతలపూడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దంత వైద్యురాలైన దేవీప్రియ ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితురాలు. ఆమె తండ్రి రామాంజనేయులు పశ్చిమగోదావరి జిల్లాకు గతంలో జాయింట్ కలెక్టర్ గా చేశారు. 1995 బ్యాచ్ కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం వర్షాభావ ప్రాంతాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ భార్యగానే కాకుండా దంత వైద్యురాలిగా దేవీప్రియ ఈ ప్రాంత ప్రజలకు బాగా దగ్గరయ్యారు.