: సోమవారం కాకినాడలో దీక్ష చేపట్టనున్న బాబు


విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాకినాడలో సోమవారం ఒక్కరోజు దీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బాబు సర్కారుపై మండిపడ్డారు. ముందు చూపులేని ఒప్పందాలతో రాష్ట్రాన్ని అంధకారంలో ముంచారని ఆరోపించారు. ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్న సర్కారు వాటిని ప్రజల నెత్తిన రుద్దాలని భావిస్తోందని ఆయన విమర్శించారు.

ప్రజలపై రూ.6500 కోట్ల మేర రుణభారం పెరిగిపోతోందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. సర్కారు అసమర్థ, అనాలోచిత విధానాలే విద్యుత్ ఛార్జీల పెంపుకు కారణమని విశ్లేషించారు. ఎవడబ్బ సొమ్ము అని ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కట్టబెట్టారని బాబు.. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనను దుయ్యబట్టారు. 

  • Loading...

More Telugu News