: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే నాదే బాధ్యత: పొన్నాల


వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తనదే బాధ్యత అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఇవాళ హైదరాబాదులో మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ నుంచి దళితులు వెళ్లిపోయారని ఆయన తెలిపారు. పోలవరం కాంట్రాక్టర్లతో మాట్లాడే పెద్దమనిషి కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. బాబ్లీ నిర్మాణానికి సహకరించిన వారికి టిక్కెట్లు ఇచ్చి బడుగులను కించపరిచే దురహంకారి కేసీఆర్ అని పొన్నాల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

  • Loading...

More Telugu News