: జగన్ మేనిఫెస్టోలో కొత్తదనం లేదు: యనమల
జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన వైఎస్సార్సీపీ మేనిఫెస్టోపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. జగన్ మేనిఫెస్టోలో ఎలాంటి కొత్తదనం లేదని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. మీకోసం పాదయాత్రలో చంద్రబాబు చెప్పినవే కాపీకొట్టారని అన్నారు. కాగా, జగన్ అవినీతి రహితపాలనను అందిస్తాననడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.