: కేసీఆర్ కుటుంబాన్ని తలదన్నిన వైఎస్ కుటుంబం


కేసీఆర్ తన కుటుంబ సభ్యుల్లో నలుగురికి సీట్లు కేటాయించి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరతీస్తే, వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఐదుగురు బంధువులకు సీట్లు కేటాయించి రికార్డు బ్రేక్ చేసింది. తాజాగా వైఎస్సార్సీపీ ప్రకటించిన జాబితాలో వైఎస్ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఎన్నికల బరిలో నిలిచారు. తల్లి వైఎస్ విజయమ్మ విశాఖపట్టణం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, జగన్ పులివెందుల నుంచి బరిలో నిలుస్తున్నారు. ఒంగోలు నుంచి ఎన్నికల బరిలో వైవీసుబ్బారెడ్డి (బాబాయ్) ఉండగా, కడప నుంచి అవినాష్ రెడ్డి (కజిన్) పోటీ పడుతున్నారు. కమలాపురం నుంచి రవీంద్రనాథ్ రెడ్డి (మేనమామ) బరిలో నిలిచారు. దీంతో ఈసారి జగన్ తో కలసి బంధువర్గం నుంచి ఐదుగురు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News