: మద్దతు ఎవరికి ఇద్దాం చెప్మా?... తెలంగాణ రాజకీయ జేఏసీ భేటీ
తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు టీఎన్జీవో భవన్ లో సమావేశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ అంశాలు, పార్టీలకు మద్దతు వంటి అంశాలపై వారు చర్చిస్తున్నారు. ఉద్యమపార్టీగా టీఆర్ఎస్ కు మద్దతివ్వాలా?, తెలంగాణ రాష్ట్రాన్ని కేటాయించిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలా?, లేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటించిన బీజేపీకి మద్దతు ఇవ్వాలా? అనే ధర్మసంకటంలో నేతలు కొట్టుమిట్టాడుతున్నారని సమాచారం. ఒకవేళ టీడీపీతో జత కట్టిందని బీజేపీకి మద్దతు ఉపసంహరించినా... కాంగ్రెస్, టీఆర్ఎస్ లలో దేనికి మద్దతివ్వాలనే విషయంపై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారని సమాచారం.