: ఎంతో దూరం నుంచి వచ్చా... చెప్పేది కాస్త వినరూ!: రఘువీరా సతీమణి


ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎంతో దూరం నుంచి తాను వచ్చానని, తన ప్రసంగం వినేందుకైనా రావాలంటూ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సతీమణి సునీత మహిళలను కోరారు. సునీత ఆదివారం నాడు అనంతపురం జిల్లా తాడంగిపల్లి, మోపుర్లపల్లి, ఎం.కొత్తపల్లి, గైరాజుపల్లి, నారనాగేపల్లి, బూచెర్ల తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.కొత్తపల్లిలో మహిళలు దూరంగా నిలుచుని చూస్తుండడంతో ఆమె స్పందించారు.

'నేను ఎంతో దూరం నుంచి మీ గ్రామానికి వస్తే, కనీసం నా ప్రసంగం వినడానికైనా దగ్గరకు రాలేరా?' అంటూ మైక్ పట్టుకుని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త రఘువీరారెడ్డి మడకశిర, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఎంతగానో అభివృద్ధి చేశాడని, ఇప్పుడు పెనుకొండలో అభివృద్ధి చేయడానికి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడని వివరించారు. ఈ నెల 16న జరుగనున్న నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలిరావాలంటూ ఆమె పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News