: షర్మిల, కొణతాల పోటీ చేయనన్నారు: వాసిరెడ్డి పద్మ
వైఎస్సార్సీపీ ప్రకటించిన సీమాంధ్ర అభ్యర్థుల జాబితాలో జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల, కొణతాల రామకృష్ణ పేర్లు లేని సంగతి తెలిసిందే. దానిపై ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, షర్మిల, కొణతాల ఎన్నికల్లో పోటీ చేయమన్నారని, అందుకే కేటాయించలేదని చెప్పారు. అయితే, ముందునుంచి అనుకున్న వారికే టికెట్లు కేటాయించామని, అభ్యర్థుల ప్రకటన ద్వారా ఎలాంటి అసమ్మతి రాదని పద్మ వివరించారు. కాగా, త్వరలో 5 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.