: వనరుల్ని కాంగ్రెస్ దోచుకుంది: జవదేకర్
సహజ వనరులను కాంగ్రెస్ పార్టీ దోచుకుందని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ దోపిడీకి బొగ్గు కుంభకోణమే నిదర్శనమని అన్నారు. ప్రధానిని రబ్బరు స్టాంపు చేసిన సోనియా గాంధీ కాంగ్రెస్ చేసిన దోపిడీపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను సీబీఐ కాపాడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 లక్షల కోట్ల బొగ్గును దోచుకునేలా చేశారని జవదేకర్ ఆరోపించారు. 10 జనపథ్ సూచనల ఆధారంగానే బొగ్గు గనుల కేటాయింపు జరిగిందని ఆయన విమర్శించారు. టీడీపీ, బీజేపీ కూటమికి స్పష్టమైన మెజారిటీ వస్తుందని జవదేకర్ స్పష్టం చేశారు.