: ఎన్నికలకు, పండుగలకు సంబంధం లేదు: వీహెచ్ పీ
ఎన్నికలకు, పండుగలకు సంబంధం లేకపోయినా అడ్డుకుంటున్నారని వీహెచ్ పీ రాయలసీమ అధ్యక్షుడు రామరాజు అన్నారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను ఎన్నికల కోడ్ తో ముడిపెట్టడాన్ని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు ఖండించారు. రాయలసీమలోని మూడు జిల్లాల్లో హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకోవడానికి అనుమతిచ్చి, అనంతరం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని ఆయన మండిపడ్డారు.