: అంబేద్కర్ ను రాహుల్ అవమానపరుస్తున్నారు: మోడీ


కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అంబేద్కర్ ను అవమానపరుస్తున్నారని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని లకీంపూర్ లో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీకి చరిత్ర, సంస్కృతి తెలియదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అంబేద్కర్ సిద్ధాంతాలను పాటించలేదని మోడీ దుయ్యబట్టారు. ప్రధాని మన్మోహన్ నోటికి తాళం వేసింది ఎవరో సోనియా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్టడంలేదని మండిపడ్డారు. దేశంలో 70 శాతం గ్రామీణులు కలుషిత నీరు తాగుతున్నారని ఆయన దుయ్యబట్టారు. యూపీఏ విధానాల ఫలితంగా యువతకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయని ఆయన మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం విద్యుత్ అవసరాలను తీర్చలేకపోవడంతో అనేక పరిశ్రమలు మూతబడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News