: నటి రేవతిలో అమ్మను చూసుకుంటున్న అలియాభట్
బాలీవుడ్ నటి అలియాభట్ కు అమ్మ దొరికింది! ఆశ్చర్యపోకండి. నటి, దర్శకురాలు రేవతిలో అమ్మను చూసుకుంటున్నట్లు అలియా భట్ తెలిపింది. 2 స్టేట్స్ సినిమాలో రేవతి, అలియాభట్ కలసి పనిచేశారు. ఇందులో అలియా తల్లి పాత్రను రేవతి పోషించారు. సినిమా షూటింగ్ చివరకు వచ్చేసరికి తమ మధ్య తల్లీ, కూతుళ్ల అనుబంధం ఏర్పడినట్లు అలియా వెల్లడించింది. రేవతి అద్భుతమైన నటి అని, ఆమెను తన తల్లిగా భావిస్తున్నానని పేర్కొంది.