: 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు... నిందితుడి కోసం వేట


ముంబై మహా నగరం. బాలికలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఓ కామోన్మాది ఎక్కడి నుంచో గానీ వాలిపోతాడు. వారిని లైంగికంగా వేధించుకుతింటాడు. గత ఆరు నెలల కాలంలో 13 మంది బాలికలు, 8 నుంచి 15ఏళ్ల వయసులోపు వారు అతడి చేతిలో లైంగిక దాడికి, వేధింపులకు గురయ్యారు. ముంబై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో అతడిపై కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబై క్రైంబ్రాంచ్ లోని 50 మంది పోలీసులు రంగంలోకి దిగారు. అతడి కోసం వేట సాగిస్తున్నారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీల ఆధారంగా, వేధింపులకు గురైన బాధిత బాలికలు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడి ఊహా చిత్రంను గీయించారు. వాటి సాయంతో అతడి కోసం గాలిస్తున్నారు. నిందితుడికి ఒక కన్ను దెబ్బతిన్నట్లు, అతడు రాకేశ్, ఇర్ఫాన్ పేర్లతో చెలామణీ అవుతున్నట్లు గుర్తించారు.

  • Loading...

More Telugu News