: అంబేద్కరుకు ఘన నివాళులర్పించిన వైఎస్ జగన్
హైదరాబాదులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 124వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్ లోటస్ పాండ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇవాళ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ త్యాగాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం జగన్ కర్నూలు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.