: మోడీజీ వాజ్ పేయితో నాటి సంప్రదింపులను బయటపెట్టాలా?: పీఎంవో


2002లో గుజరాత్ లో అల్లర్లు జరిగిన సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ నాటి ప్రధాని వాజ్ పేయితో జరిపిన సంప్రదింపులను బయటపెట్టేందుకు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) సిద్ధమవుతోంది. నాటి సంప్రదింపుల వివరాలు కోరుతూ సమాచారహక్కు చట్టం కింద పీఎంవో కార్యాలయానికి దరఖాస్తు వచ్చింది. 2002 ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 30 మధ్య గుజరాత్ ప్రభుత్వం, పీఎంవో కార్యాలయం మధ్య జరిగిన అన్ని రకాల సంప్రదింపుల వివరాలు కావాలని దరఖాస్తుదారుడు కోరారు. మోడీ, వాజ్ పేయి మధ్య సంపద్రింపుల వివరాలు కూడా ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. తొలుత పీఎంవో కార్యాలయం సమాచారం ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, దరఖాస్తుదారుడు అప్పీలేట్ అథారిటీకి వెళ్లగా సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సమాచారం వెల్లడించాలా? వద్దా? అని గుజరాత్ ప్రభుత్వం, మోడీని పీఎంవో కార్యాలయం అధికారులు కోరారు.

  • Loading...

More Telugu News