: మహిళా సాధికారత కోసం కృషి చేస్తామని ఊదరగొట్టే పార్టీల తీరిది


దేశంలో, రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా మహిళలకు అవకాశాలు కల్పించాలి. మహిళా సాధికారతకు కృషి చేయాలి. మహిళలకు సముచిత స్థానం కల్పించాలంటూ పార్టీలన్నీ ప్రసార సాధనాల్లో ఊదరగొడుతుంటాయి. తమ వరకు వచ్చే సరికి మాత్రం ఎవరికి వారే యమునాతీరే తరహాలో వ్యవహరిస్తుంటాయి. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. కానీ, సీట్ల కేటాయింపులో మాత్రం మహిళలకు అవకాశాలు కల్పించడంలో రాజకీయ పక్షాలన్నీ తీవ్రంగా విఫలమయ్యాయి.

50 శాతం మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పే నేతలు 25 శాతం సీట్లు కూడా కల్పించక పోవడం విశేషం. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 17 లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ మాత్రమే మహిళకు ఒక లోక్ సభ స్థానాన్ని కేటాయించింది. అది కూడా సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె కావడంతో కవితకు సీటు కేటాయించింది. అసెంబ్లీ అభ్యర్థులుగా 11 మందికి సీట్లు కేటాయించింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ దామాషా పద్దతిలో 9 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. ఎంపీ సీట్ల కేటాయింపులో మహిళ పేరును కూడా టీడీపీ తలవకపోవడం విశేషం.

వైఎస్సార్సీపీ 9 మంది మహిళలకు అసెంబ్లీ సీట్లు కేటాయించింది. ఇక 125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పురుషాధిక్యాన్ని ప్రదర్శించింది. కేవలం ఎనిమిది మంది మహిళలకు మాత్రమే అసెంబ్లీ సీట్లు కేటాయించి, పార్టీ ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పింది. రాజకీయ పార్టీలన్నీ సీట్ల కేటాయింపులో వ్యవహరించిన తీరును మహిళా సంఘాలు ముక్తకంఠంతో తూర్పారబడుతున్నాయి. మహిళలంటే ఉన్న చిన్న చూపును మహిళలంతా దుయ్యబడుతున్నారు. వీరి పాలనలో మహిళలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News