: పవన్ కల్యాణ్ ను కలసి, ప్రచారం చేయమని కోరిన కిషన్ రెడ్డి
ఎన్నికల ప్రచార పర్వంలో మరో అధ్యాయం మొదలైంది. ఎన్నికల బరిలోకి దిగని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచార పర్వంలోకి మాత్రం అడుగుపెట్టనున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఈ రోజు పవన్ కల్యాణ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలిశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో బీజేపీ తరఫున ప్రచారం చేయాలని ఈ సందర్భంగా పవన్ ను కిషన్ రెడ్డి కోరారు. కిషన్ విజ్ఞప్తికి వపన్ సానుకూలంగా స్పందించి... ఈ విషయంలో తన పార్టీ సహచరులతో, సన్నిహితులతో సంప్రదించి చెబుతానని హామీ ఇచ్చారు.