: నా ఫుల్ సపోర్ట్ పవన్ కల్యాణ్ కే: రేణూదేశాయ్
పవన్ కల్యాణ్ లాంటి ఉత్తముడు ఈ భూమి మీదే ఉండరంటూ అతని మాజీ భార్య రేణూదేశాయ్ ఆకాశానికి ఎత్తేశారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి తన మద్దతు ఉంటుందని ఆమె ఫేస్ బుక్ లో వ్యాఖ్యానిస్తూ, పవన్ కల్యాణ్ స్వచ్చమైన మానవత్వం కలిగిన మనిషని అన్నారు. వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో తామిద్దరికి మాత్రమే తెలుసని, దీనిపై విమర్శలు గుప్పించే అర్హత ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు. తాను అమితంగా గౌరవించి, అభిమానించే వ్యక్తుల్లో పవన్ కల్యాణ్ ఒకరని ఆమె తెలిపారు. పవన్ లాంటి మంచి మనుషులు సమాజానికి ఎంతో అవసరమని ఆమె అన్నారు. సమాజానికి మంచి చేయాలన్న తపనతో, నిజాయతీతో పవన్ కల్యాణ్ పోరాటం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.