: ఆప్ లోక్ సభ అభ్యర్థిపై ఐరన్ రాడ్లతో దాడి
అరవింద్ కేజ్రీవాల్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల వరకు... ఎవరు ఎక్కడికెళ్లినా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా ఆ పార్టీ నలందా లోక్ సభ అభ్యర్థి ప్రణవ్ ప్రకాష్ పై బీహార్ లోని ఉదార్ప్ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు అతి దారుణంగా దాడికి పాల్పడ్డారు. తన నియోజకవర్గంలో ప్రకాష్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో గుంపుగా వచ్చిన వారు అతని కారును అడ్డుకున్నారు. వెంటనే అతడిని కారునుంచి బయటికి లాగి కర్రలు, ఐరన్ రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో అతని కాళ్లు, చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. మరోవైపు ఆప్ ఘజియాబాద్ అభ్యర్థి షాజియా ఇల్మీ మధ్యప్రదేశ్ లో ప్రచారం చేస్తున్న సమయంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. అనంతరం ఇల్మీ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.