: సర్కారుపై మోహన్ బాబుకు కోపమొచ్చింది..!


ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వం తనిఖీలకు ఉపక్రమించడంపై సినీ నటుడు మోహన్ బాబు మండిపడ్డారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం దారుణమని శ్రీనికేతన్ విద్యాసంస్థల యజమాని అయిన మోహన్ బాబు  వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయమై ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘం నేడు హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ కోరిన కళాశాలలపై టాస్క్ ఫోర్స్ తో దాడులు చేయిస్తూ ప్రభుత్వం భయాందోళనలకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. అక్రమాలకు పాల్పడే కళాశాలల అనుమతులు రద్దు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని మోహన్ బాబు చెప్పారు. 

  • Loading...

More Telugu News