: అశ్లీల సైట్లపై చైనా ఉక్కుపాదం
చైనా మరోసారి దేశంలోని అశ్లీల వెబ్ సైట్లపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. సైట్లలో అన్ని రకాల అశ్లీల(పోర్నోగ్రఫీ) చిత్రాలు, వీడియోలు, సమాచారం ఇతరత్రా ఏమైనా ఉంటే వాటిని వెంటనే తొలగించాలని యాంటీ పోర్నోగ్రఫిక్ అండ్ ఇల్లీగల్ పబ్లికేషన్స్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఈ విభాగం అధికారులు ఇకనుంచి అన్ని రకాల వెబ్ సైట్లపై నిఘా వేసి ఉంచుతారు. ఆదేశాలకు వ్యతిరేకంగా వెబ్ సైట్లు అసభ్యకరమైన సందేశాలు, చిత్రాలు, సమాచారం, వీడియోలను కలిగి ఉంటే వాటిని బలవంతంగా మూసివేయడంతోపాటు లైసెన్సులను కూడా రద్దు చేస్తారు. ఈ కార్యక్రమం వచ్చే నవంబర్ వరకు కొనసాగుతుంది.