: రాహుల్ ముందు పెళ్లి చేసుకో... ఆ తర్వాత మోడీని విమర్శించు: శివసేన
తన వైవాహిక స్థితిపై విమర్శలు ఎదుర్కొంటున్న నరేంద్రమోడీకి శివసేన మద్దతుగా నిలబడింది. మోడీ వైవాహిక స్థితిపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని నిలదీస్తూ పార్టీ పత్రిక సామ్నాలో శివసేన సంపాదకీయం రాసింది. మోడీ వివాహంపై మాట్లాడితే ద్రవ్యోల్బణం దిగొస్తుందా? బొగ్గు కుంభకోణంలో దోచుకున్న ధనం వెనక్కి తిరిగి వస్తుందా? అని రాహుల్ ను నిలదీసింది. మోడీ, జశోదా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారని, పరస్పర అంగీకారంతో విడిపోయారని పేర్కొంది. మోడీ వివాహంపై మాట్లాడే ముందు రాహుల్ పెళ్లి చేసుకోవాలని సూచించింది.