: బిడ్డను దత్తతు చేసుకోవాలనుకుంటున్న మనీషా కొయిరాల!
సంవత్సరంన్నర కిందట ఒవేరియన్ కాన్సర్ బయటపడటంతో విదేశాల్లో చికిత్స తీసుకున్న నటి మనీషా కొయిరాల ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే భవిష్యత్తులో ఓ బిడ్డను దత్తతు చేసుకోవాలనుకుంటున్నట్లు ట్విట్టర్ లో వెల్లడించింది. అయితే, తనలోని వ్యాధి పునరావృతం కాదన్న భయాన్ని ఎప్పుడు అధిగమిస్తానో అప్పుడే ఆ పని చేస్తానని చెప్పింది. అప్పటివరకు తన కుటుంబంతోనే ఉంటానని తెలిపింది.