: ఏడుగురు బేబీలను చంపేసిన రాక్షస తల్లి
జన్మనిచ్చే అమ్మను దేవతతో సమానమని భావిస్తాం. కానీ, అమెరికాలో ఓ 39 ఏళ్ల అమ్మ మాత్రం తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డల పట్ల మానవ రూపంలో ఉన్న రాక్షసిలా వ్యవహరించింది. 10 ఏళ్ల కాలంలో తాను జన్మనిచ్చిన ఏడుగురు పసివారిని అంతమొందించింది. అదీ కిరాతకంగా! ఉతా రాష్ట్రంలోని ప్లెజెంట్ గ్రోవ్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఆ కర్కోటక మహిళ మెఘాన్ ను ఆమె భర్త ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు.
మెఘాన్ మాజీ భర్త ఇచ్చిన సమాచారంతో ఆమె ఇంటికి వెళ్లి తనిఖీ చేసిన పోలీసులకు రోజుల వయసున్న బేబీ మృతదేహం కనిపించింది. అలాగే మరో ఆరుగురు పసివారి మృత దేహాలు ఒక్కోటీ ఒక్కో కంటెయినర్ లో ప్యాక్ చేసి ఉన్నట్లు బయటపడింది. పదేళ్ల కాలంలో మెఘాన్ తనకు పుట్టిన ప్రతీ శిశువుని అలా చంపేస్తూ వచ్చినట్లు విచారణలో తేలింది.