: కేజ్రీవాల్ మకాం ఇక వారణాసిలోనే!
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వారణాసికి వెళుతున్నారు. ఈ రోజు నుంచి వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికలు పూర్తయ్యే మే 12 వరకు అక్కడే మకాం వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా మోడీని ఓడించాలనే లక్ష్యంతో కేజ్రీవాల్ ఉన్నారు. వారణాసిలో ఖ్వామి ఏక్తాదళ్ నేత ముక్తార్ అన్సారీ సహా ఎవరి మద్దతు తమకు అవసరం లేదని ఆప్ ప్రకటించింది. అక్కడ కేజ్రీవాల్ ఈ నెల 23 లేదా 24న నామినేషన్ వేస్తారని పార్టీ నేత మనీష్ సిసోడియా తెలిపారు.