: ట్విట్టర్ లో నమో నమో


నేతలు ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగానూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల వెబ్ సైట్లలో నేతలు తరచుగా విషయాలను పొందుపరుస్తుంటే... వాటిని లక్షల సంఖ్యలో అభిమానులు ఫాలో అవుతున్నారు. ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నికల ప్రచారం విషయంలో దేశంలో అందరి నేతల కంటే ముందున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ (నమో) ట్విట్టర్లోనూ హవా కొనసాగిస్తున్నారు. 37 లక్షల మంది ఆయన్ను అనుసరిస్తూ నమో మంత్రం జపిస్తున్నారు.

మోడీ తర్వాత కేంద్ర సహాయ మంత్రి శశిథరూర్ ను 21లక్షల మందికి పైగా ఫాలో అవుతుంటే, కేజ్రీవాల్ ను 16 లక్షల మంది అనుసరిస్తున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కు 17లక్షలు, సుష్మాస్వరాజ్ కు 10.30లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆప్ నేత గుల్ పనాగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఆ పార్టీ నేతలు స్మృతి ఇరానీ, వరుణ్ గాంధీ తదితరులు ఎక్కువ మంది ఫాలోయర్లను కలిగిన మొదటి 20 మంది నేతల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News