: జెన్నిఫర్ లోపెజ్ వి గొంతెమ్మ కోర్కెలంటున్న ఐపీఎల్
పాప్ సంగీత ప్రియులకు చేదువార్త. ఐపీఎల్ ప్రారంభోత్సవంలో ఇంటర్నేషనల్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ ప్రదర్శన ఉంటుందని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశ. భారత్ లో ప్రదర్శనకు వచ్చే క్రమంలో లోపెజ్ గొంతెమ్మ కోర్కెలు కోరడంతో ఐపీఎల్ నిర్వాహకులు ఆమె కచేరీని రద్దు చేశారట. లోపెజ్ అమెరికా నుంచి కోల్ కతా రావాలంటే ఓ ప్రైవేటు విమానం సమకూర్చడంతోపాటు, ఆమె భారీ పరివారానికి డజన్లకొద్దీ హోటల్ రూములు బుక్ చేయాలట.
ఆ బృందంలో లోపెజ్ స్టయిలిస్టులు, సహాయకులు, చెఫ్ తదితరులు ఉన్నారట. ఆమె కోర్కెలు మరీ విపరీతంగా ఉన్నాయని భావించిన ఐపీఎల్ నిర్వాహకులు అంతటితో సర్దుకున్నారు. దీంతో, మరో అంతర్జాతీయ ర్యాప్ స్టార్ పిట్ బుల్ ను సంప్రదించగా, అతడు ప్రారంభోత్సవంలో ప్రదర్శన ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో షారూక్ ఖాన్ తోపాటు కత్రీనా కూడా చిందేయనుంది.