: నిరాశతో వెనుదిరిగిన కేశినేని నాని
విజయవాడ లోక్ సభ సీటును ఆశిస్తున్న కేశినేని ట్రావెల్స్ యజమాని, టీడీపీ నేత కేశినేని నాని ఈ రోజు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అయితే నానికి చంద్రబాబు అందుబాటులోకి రాలేదు. దీంతో కేశినేని నిరాశగా వెనుదిరిగారు. మరో గంటలో ఆయన చంద్రబాబుతో కలిసే అవకాశం ఉంది. నిన్న కూడా చంద్రబాబును కేశినేని కలిశారు. అయితే విజయవాడ ఎంపీ సీటుపై ఆయనకు బాబు నుంచి ఎలాంటి హామీ రాలేదు. దీంతో, ఈ రోజు మరోసారి చంద్రబాబును కలసి ఎలాగైనా ఎంపీ సీటును దక్కించుకోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు.