: పొట్లూరి వరప్రసాద్ ఓ ఇంటర్నేషనల్ స్మగ్లర్: కేశినేని నాని


విజయవాడ లోక్ సభ సీటును ఆశిస్తున్న పొట్లూరి వరప్రసాద్ పై టీడీపీ నేత కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పొట్లూరి ఓ ఇంటర్నేషనల్ స్మగ్లర్ అని... అతన్ని అరెస్ట్ చేసేందుకు ఇంటర్ పోల్ ప్రయత్నిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. తనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తానని రెండేళ్ల క్రితమే చంద్రబాబు చెప్పారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనని స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం చంద్రబాబును కలవడానికి వెళ్లినప్పటికీ ఆయనతో మాట్లాడటం కుదరలేదని... రాత్రి 10.30కి కలుస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News