: దేవెగౌడను గుజరాత్ ఆహ్వానించిన నరేంద్రమోడీ


భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ మాజీ ప్రధాని దేవేగౌడను గుజరాత్ ఆహ్వానించారు. "మీరు మాజీ ప్రధాని, నేను మీ కొడుకు లాంటి వాడిని, మీకు ఇక్కడ ఉండటం కష్టంగా ఉంటే గుజరాత్ కు రండి, మీకు సకల సౌకర్యాలు కల్పిస్తాను, మీ కుమారుడి కంటే బాగా చూసుకుంటాను" అని అన్నారు. ఈ రోజు కర్ణాటకలోని చిక్ బళ్లాపురం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి 272 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న దేవేగౌడ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆయన ఈ విధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News