: దొరల పాలన కోసమే పునర్నిర్మాణం: మోత్కుపల్లి
టీఆర్ఎస్ దృష్టిలో పునర్నిర్మాణం అంటే దొరల పాలనే అని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. టీఆర్ఎస్ అనేది కేసీఆర్ కుటుంబ పార్టీ అని... ఆ పార్టీకి అధికారం కట్టబెడితే తెలంగాణ అధోగతి పాలవుతుందని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు.