: టీడీపీ కాంగ్రెస్ పార్టీలా మారింది: సీపీఎం కార్యదర్శి మధు
వలసలను ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం పార్టీ... కాంగ్రెస్ పార్టీలా మారిపోయిందని సీపీఎం సీమాంధ్ర కార్యదర్శి మధు ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. మతతత్వ బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం పచ్చి అవకాశవాదమని చెప్పారు. విశాఖ జిల్లాలో 2 లోక్ సభ, 8 అసెంబ్లీ స్థానాలకు సీపీఎం పోటీ చేస్తుందని తెలిపారు.