: కయ్యానికి కాలుదువ్వి లబ్ది పొందడం కేసీఆర్ నైజం: రుద్రరాజు


సమస్యల్ని శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవడం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇష్టం ఉండదని కాంగ్రెస్ నేత రుద్రరాజు పద్మరాజు విమర్శించారు. ఏదోలా కయ్యానికి కాలుదువ్వి, రాజకీయంగా లబ్ది పొందాలనే ఆలోచన మాత్రమే ఆయనకు ఉంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయని జీవోఎం క్లియర్ గా చెప్పిందని... అయినా కూడా సీమాంధ్ర ఉద్యోగులను భయపెట్టి వారి మద్దతు పొందాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. విభజన జరిగిన తర్వాత కూడా ఆప్షన్లు ఉండవని కేసీఆర్ వ్యాఖ్యానిస్తుండటం శోచనీయమని తెలిపారు.

  • Loading...

More Telugu News