: మోడీ భార్యకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలంటున్న కాంగ్రెస్ నేతలు


ఎన్నికల నామినేషన్ లో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ తన భార్య జశోదా పేరును పేర్కొనడంతో... ఒక్కసారిగా ఆమె జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో, ఆమెకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించాలని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలే కోరుతున్నారు. ఉగ్రవాదులకు జశోదా లక్ష్యంగా మారే అవకాశం ఉందని... అందువల్ల ఆమెకు రక్షణ అవసరమని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అభయ్ దుబె, రవి సక్సేనాలు ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ కల్పించాలంటూ కేంద్ర హోం మంత్రి షిండేకు లేఖ రాశారు.

  • Loading...

More Telugu News