: కేసీఆర్ పై సెటైర్లు విసిరిన దామోదర
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ చెప్పలేదని... ఈ మాటలన్నీ చెప్పింది కేసీఆరే అని అన్నారు. ఇప్పుడు మాట తప్పి కొత్త పల్లవి అందుకున్నాడని విమర్శించారు. మాట తప్పిన వాడిని తెలంగాణ భాషలో ఏమంటారో చెప్పండని సభకు హాజరైన వారిని ప్రశ్నించారు. సభకు హాజరైన వారిలో కొంత మంది 'బట్టెబాజ్' అంటారంటూ గట్టిగా అరిచారు. హైదరాబాదులో ఈ రోజు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణను తామే సాధించామని కేసీఆర్ డబ్బా కొట్టుకుంటున్నారని దామోదర విమర్శించారు. సగం కడుపును కోసుకుని, సీమాంధ్రలో పార్టీ నాశనం అవుతుందని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని చెప్పారు.