: 'సీబీఐ దర్యాప్తు'తో కాంగ్రెస్ వేదిస్తోంది: అఖిలేశ్ యాదవ్


తన మాట వినని వారిని 'సీబీఐ దర్యాప్తు'తో కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆరోపణ చేశారు. అలహాబాద్ లో ఈ రోజు విలేకరులతో మాట్లాడిన అఖేలేశ్, కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. సీబీఐని పావులా వాడుకుంటూ, సమాజ్ వాదీ పార్టీ పట్ల కాంగ్రెస్ భిన్న వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన దుయ్యబట్టారు.  కాగా, ఎప్పుడు ఎన్నికలొచ్చినా సమాజ్ వాదీ పార్టీకి మంచి ఫలితాలే వస్తాయని అఖేలేశ్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News