: వైఎస్సార్సీపీ మేనిఫెస్టో వివరాలు...
రానున్న సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు...
* అవినీతికి తావులేని విధంగా పారదర్శక పాలన.
* ఫీజు రీయింబర్స్మెంట్ కింద మొత్తం ఫీజు చెల్లింపు.
* వృద్ధులకు రూ.700 ఫించన్.
* రూ. 20 వేల కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ.
* 20 వేల పంచాయతీల్లో 2 లక్షల మంది మహిళలకు ఉపాధి.
* అమ్మఒడి పథకం ద్వారా బడికి వెళ్లే నిరుపేద పిల్లలకు రూ.500 చొప్పున, ఇద్దరు పిల్లలకు రూ. 1000 బ్యాంక్ అకౌంట్లో జమ.
* రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి.
* ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం, అనాధాశ్రమం.
* వంటగ్యాస్పై రూ.100 సబ్సిడీ.
* ప్రతి ఉద్యోగికి పక్కా ఇళ్లు.
* ప్రతి రెండు జిల్లాలకు ఓ వ్యవసాయ కాలేజ్.
* మూడు అగ్రికల్చర్, వెటర్నరీ యూనివర్శిటీల ఏర్పాటు.
* పెట్రో యూనివర్శిటీ ఏర్పాటు.
* ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజ్, ప్యాకేజింగ్ సౌకర్యం.
* రైతుల కోసం 102 మొబైల్ సర్వీస్. ఈ సర్వీసు ద్వారా ఫోన్ చేసిన ప్రతి రైతుకు 20 నిమిషాల్లో సేవలు.
* ఐదేళ్లలో 50 లక్షల ఇళ్ల నిర్మాణం.
* ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్నవారు తిరిగి పనుల్లోకి వెళ్లేవరకు నెలకు రూ.3 వేలు.
* ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి.
* నియోజకవర్గంలో ఒకచోట మాత్రమే మద్యం అమ్మకం.
* 2019 నాటికి విద్యుత్ కొరత లేకుండా చూడటం.
* కొత్తగా కట్టే రాజధానికి సకల సౌకర్యాలు కల్పించడం.
* ప్రతి జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్.
* విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం.
* శ్రీకాకుళం నుంచి బెంగళూరు, చెన్నైకి ఎయిట్ వే (8 వే) కారిడార్.
* కడప, విశాఖపట్టణాలకు మెట్రో రైలు.