: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నా: కన్నబాబు
విశాఖ జిల్లా యలమంచిలి శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే కన్నబాబు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి, తనకు మధ్యే పోటీ అని ప్రకటించారు. కన్నబాబును టీడీపీలోకి తీసుకొచ్చేందుకు గంటా శ్రీనివాసరావు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ రోజు విశాఖలో వీరిద్దరి మధ్య చర్చలు జరిగినా సఫలం కాలేదు. మరోవైపు కన్నబాబును తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ కూడా మంతనాలు సాగించింది. కానీ, అనూహ్యంగా కన్నబాబు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.