: నిలకడగా నెల్సన్ మండేలా ఆరోగ్యం


దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు.. నల్లజాతి యోధుడు నెల్సన్ మండేలా ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది. ఆయన ఏ ఇబ్బందీ లేకుండా శ్వాస తీసుకుంటున్నారని మండేలా ప్రతినిధి మాక్ మహరాజ్ జొహెనెస్ బర్గ్ లో తెలిపారు. ఆసుపత్రిలో మండేలాకు న్యూమోనియాకు సంబంధించి చికిత్స అందిస్తున్నారని, దీనికి మండేలా పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించారు. 

  • Loading...

More Telugu News