: టీఆర్ఎస్ ఓ పిల్లకాకి: పొన్నాల
టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. నిన్న కాక మొన్న పుట్టిన ఆ పార్టీ ఓ పిల్లకాకితో సమానమని చెప్పారు. ఈ రోజు కరీంనగర్ కు వచ్చిన సందర్భంగా పొన్నాల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఓ పెద్ద అవకాశవాది అని చెప్పారు. తెలంగాణ ద్రోహులను తన పార్టీలో చేర్చుకున్న ఘనత కేసీఆర్ ది అంటూ విమర్శించారు. తన రాజకీయ జీవితంలో కేసీఆర్ ఏనాడైనా ప్రజాసంక్షేమం గురించి మాట్లాడారా? అని పొన్నాల ప్రశ్నించారు.