: పొన్నాల టికెట్లను అమ్ముకున్నారు: జెడ్సన్
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్యపై జనగామ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి జెడ్సన్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన పొన్నాలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం అన్యాయమని అన్నారు. టికెట్లను అమ్ముకున్న పొన్నాల నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. టికెట్ల కేటాయింపులో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.