: ప్రియాంకకు పిన్నమ్మ దీటైన జవాబు
దారి తప్పిన తన సోదరుడు వరుణ్ గాంధీని దారిలో పెట్టాలన్న ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలపై ఆమె పిన్నమ్మ మేనకాగాంధీ స్పందించారు. దేశానికి సేవ చేయడం దారి తప్పడం అయితే, ఎవరు తప్పుడు బాట ఎంచుకున్నారో దేశమే నిర్ణయిస్తుందని మేనకా బదులిచ్చారు. ప్రియాంక నిన్న ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో మాట్లాడుతూ వరుణ్ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై బీజేపీ కూడా ఘాటుగానే స్పందించింది. వరుణ్ గాంధీకి ప్రాచుర్యం పెరిగిపోవడంతో కాంగ్రెస్ అభద్రతా భావానికి లోనవుతోందని బీజేపీ పేర్కొంది.