: షర్మిలకు హ్యాండ్... విశాఖ బరిలో విజయమ్మ?
వైఎస్సార్సీపీలో మరో ట్విస్ట్. ఇంతకాలం విశాఖ నుంచి షర్మిల పోటీ చేస్తుందన్న ఊహాగానాలకు తెరపడనుంది. అనూహ్యంగా వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెరమీదకు వచ్చారు. విశాఖ లోక్ సభ స్థానం నుంచి ఆమె పోటీచేయనున్నారని విశ్వసనీయ సమాచారం. ఇంకా చెప్పాలంటే ఈ నెల 17న ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.